హైదరాబాద్: 28°C
క్రీడలు

కౌంటీల్లో అదరగొడుతున్న మానవ్ సుతార్

టీమిండియా రైజింగ్ స్పిన్నర్ మానవ్ సుతార్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో అదరగొడుతున్నాడు. వార్విక్‌షైర్ తరఫున ఆడుతున్న అతను హాంప్‌షైర్‌తో మ్యాచ్‌లో ఏడు వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 3, రెండో ఇన్నింగ్స్‌లో 4) పడగొట్టాడు. మానవ్ విజృంభణతో వార్విక్‌షైర్ ఇన్నింగ్స్ 129 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.