హైదరాబాద్: 28°C
క్రీడలు

పాక్‌ను హడలెత్తిస్తున్న భారత బౌలర్లు

మహిళల టీ20 ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. మన బౌలర్ల ధాటికి పాక్ జట్టు 9.1 ఓవర్లలోనే 35 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తెలుగు తేజం శ్రీచరణి 2 ఓవర్లలో 3 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టింది. ప్రేమ్ రావత్, దీప్తి శర్మ, షఫాలీ వర్మ తలో వికెట్ తీసుకున్నారు.