హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అంధకారంలో అంబేద్కర్ కాలనీ.. పట్టించుకునే నాధుడే లేడా..!

BHPL: నిజాంపల్లి గ్రామంలోని అంబేద్కర్‌ కాలనీ చీకట్లో మగ్గుతోంది. గత నెలలోనే ఏర్పాటు చేసిన వీధిలైట్లు ప్రస్తుతం ఒక్కటి కూడా వెలగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. గ్రామంలోని ఇతర ప్రాంతాల్లో వీధిలైట్లు వెలుగుతున్నా తమ కాలనీలో ఎందుకు పనిచేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.