హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కారు ఢీకొని వాహనదారుడు మృతి

KDP: జమ్మలమడుగు మండలం ఎస్.ఉప్పలపాడు సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వాహనదారుడు మృతి చెందాడు. పెద్దముడియం మండలం దిగువ కల్వటాలకు చెందిన కేసీ. పాములేటి మరో వ్యక్తితో కలిసి బైకుపై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో పాములేటి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి.