హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బైక్ టాక్సీలు రద్దు చేయాలని డిమాండ్'

CTR: ఓలా, ఉబర్, రాపిడో బైక్ టాక్సీలను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 7న ఉదయం 10 గంటలకు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిర్వహించే ధర్నాలో ఆటో డ్రైవర్లు పెద్దఎత్తున పాల్గొనాలని ఏఐటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు. భగత్‌సింగ్ స్టాండ్ వద్ద కరపత్రాలు విడుదల చేశారు. బైక్ టాక్సీలతో ఆదాయం తగ్గి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.