హైదరాబాద్: 28°C
వార్తలు

ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

ప్రకాశం: పామూరు మండలంలోని రేగిచెట్లపల్లిలో శనివారం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బొల్లా నరసింహారావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణ కార్యక్రమం విజయవంతంగా పూర్తి కావాలని, గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.