హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్

TPT: చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో 44కుపైగా కేసులు ఉన్న మోస్ట్‌ వాంటెడ్‌ అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్‌ ఎం. తంజినిని తిరుపతి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. తమిళనాడుకు చెందిన సెల్వం (45)ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 7 ఎర్రచందనం దుంగలు, కారు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.