హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 7న అరసవల్లి ఆలయ హుండీల లెక్కింపు

SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం హుండీలను ఈ నెల 7వ తేదీన ఉ.8 గంటలకు తెరవనున్నట్లు ఆలయ ఉప కమిషనర్, కార్యనిర్వహణాధికారి ప్రసాదరావు శనివారం ప్రకటనలో తెలిపారు. దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో, అనువంశిక ధర్మకర్త, అర్చకులు, భక్తులు, గ్రామ పెద్దల సమక్షంలో హుండీలను తెరిచి కానుకలను లెక్కించనున్నట్లు వివరించారు.