హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సచివాలయంలో రీ-సర్వే సమాచార నమోదు కార్యక్రమం

BPT: కారంచేడు మండలం స్వర్ణ సచివాలయంలో శనివారం రెవెన్యూ సిబ్బంది రీ-సర్వే పర్సనల్ ఇన్ఫర్మేషన్ వర్క్ నిర్వహించారు. రీ-సర్వే పూర్తయిన రైతుల పాత రికార్డుల్లోని తప్పులను సవరించి, వాస్తవ యజమానుల పేర్లు, ఆధార్, మొబైల్ నంబర్లను అనుసంధానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.