ప్రకాశం: కనిగిరి రూరల్ మండల అధ్యక్షులు గంజి మనోజ్‌రెడ్డి అధ్యక్షతన మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నరాల శ్రీనివాసులరెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కనిగిరిలో బీజేపీ మండల సమావేశం


