హైదరాబాద్: 28°C
తెలంగాణ

బైక్ ఢీకొని వృద్ధుడికి తీవ్ర గాయాలు

KNR: శంకరపట్నం మండలం నల్ల వెంకయ్యపల్లి గ్రామానికి చెందిన వైనాల వీరయ్య (65) బర్రెలను తీసుకుని ఇంటికి వెళ్తుండగా మొలంగూర్ ఓసీడ్ ప్లాంట్ సమీపంలో వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో వీరయ్య కాలుకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సతీష్‌రెడ్డి, పైలెట్ గోపికృష్ణ ప్రథమ చికిత్స చేసి హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.