MBNR: నాగసాలలోని సర్వే నంబర్ 122లో ఉన్న ఊర చెరువు ఆక్రమణలకు గురవుతోందని గ్రామస్థులు తెలిపారు. కొత్త వెంచర్లతో చెరువు విస్తీర్ణం తగ్గుతోందని పేర్కొన్నారు. చెరువు పూర్తి విస్తీర్ణాన్ని సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసి, ఆక్రమణల నుంచి కాపాడాలని తహసీల్దార్‌ను కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో కిరణ్ కుమ్మరి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఊర చెరువును కాపాడాలని వినతి


