హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'PVC సేవలు మరింత సులభతరం'

విశాఖ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో PVC సేవలను మరింత సులభతరం చేశారు. పోలీస్ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసిన వారు ఇకపై కార్యాలయానికి పదేపదే రావాల్సిన అవసరం లేదు. మీ PVC అప్లికేషన్ ప్రస్తుత స్థితిని ఆన్‌లైన్‌లో సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం పోస్టర్‌లో ఇచ్చిన QR కోడ్ స్కాన్ చేసిన వెంటనే విశాఖ సిటీ పోలీస్ వెబ్‌సైట్‌కు వెళ్లవచ్చు.