హైదరాబాద్: 28°C
క్రీడలు

సరికొత్త చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్ కౌర్

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఏకంగా 150 మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించిన తొలి కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. పురుషుల క్రికెట్‌లోనూ ఏ కెప్టెన్ ఈ ఫీట్ సాధించలేదు. ఈ జాబితాలో శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు 121 మ్యాచ్‌లతో తర్వాతి స్థానంలో ఉంది.