హైదరాబాద్: 28°C
వార్తలు

వడ్డీ పోలమాంబ అమ్మవారి ఆలయం ప్రారంభం

విశాఖ దక్షిణ నియోజకవర్గం 30వ వార్డు పరిధిలో వడ్డీ పోలమాంబ అమ్మవారి ఆలయ నిర్మాణం పూర్తికావడంతో ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే సతీమణి పద్మజ చేతులమీదుగా ఆలయ ప్రారంభించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.