VZM: కొత్తవలస జడ్పీ పాఠశాల ఆట స్థలం రోజురోజుకు కబ్జాకు గురవుతోంది. మండల విద్యాశాఖ అధికారులు దీనిపై పట్టించుకోకపోవడంతో విద్యార్థులు ఆటలు ఆడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆక్రమణల గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చీపురుపల్లి ఈశ్వరరావును వివరణ కోరగా, ఈ సమస్య తమ దృష్టికి వచ్చిందని, త్వరలోనే ఆక్రమణలను పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేశారు.
వార్తలు
ఆక్రమణలకు గురవుతున్న పాఠశాల మైదానం


