హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బడుగువానిలంకకు భారీగా పుష్కర నిధులు మంజూరు

కోనసీమ: రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామానికి రూ.50 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కృషితో మంజూరైన నిధులతో 230 మీటర్ల గ్రావెల్ రోడ్డును సిమెంట్ రోడ్డుగా అభివృద్ధి చేయనున్నారు. లోతట్టు ప్రాంతంలో మినీ కల్వర్టు నిర్మాణంతో పాటు పుష్కర ఘాట్ వద్ద మరో 100 మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మించనున్నారు.