హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రంథాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

KMR: ఖండేబల్లూర్‌లోని నూతన గ్రంథాలయాన్ని శనివారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రారంభించారు. సరస్వతి చిత్రపటానికి పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేశారు. గ్రంథాలయాన్ని దేవాలయంగా భావించి ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నారు. కావలసిన సామగ్రి కోసం తనవంతుగా కృషి చేస్తానన్నారు. సర్పంచ్ కృష్ణ, సతీశ్ పటేల్, రమేశ్, నాయకులు పాల్గొన్నారు.