MHBD: విధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు పోలీసుల వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్ సూచించారు. తొర్రూరు పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన రికార్డులు, సీసీ కెమెరాలు, లాకప్, సిబ్బంది విధులను పరిశీలించారు. గంజాయి, గుడుంబా, అక్రమ మద్యం నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాత్రి పెట్రోలింగ్ పెంచాలని సూచించారు.
తెలంగాణ
పోలీసుల వ్యక్తిగత భద్రతకూ ప్రాధాన్యం: ఎస్పీ శబరీష్


