ASR: హుకుంపేట మండలం డూరువీధి జడ్పీ పాఠశాలలో వాటర్ పంప్‌సెట్ విద్యుత్ వైర్లను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. దీంతో మధ్యాహ్న భోజనం కోసం విద్యార్థులు, వంట సిబ్బంది బోరుబావి నుంచి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలో గతంలోనూ రెండుసార్లు చోరీలు జరిగాయని బీజేవైఎం నేత మత్యకొండబాబు తెలిపారు. చోరీ ఘటనపై శనివారం ఎస్సై దృష్టికి తీసుకెళ్లారు.
ఆంధ్రప్రదేశ్
వాటర్ పంప్‌సెట్ విద్యుత్ వైర్లు చోరీ


