హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కి ఎమ్మెల్యే వినతి

KKD: ప్రత్తిపాడు నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సాగు, తాగునీటి కొరతను తక్షణమే పరిష్కరించాలని కోరారు. నాలుగు మండలాల్లో వైద్యుల కొరత నివారణ, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, గ్రామాల్లో సీసీ డ్రైన్ల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.