హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏపీఎస్పీలో 37 అవుట్‌సోర్సింగ్ పోస్టులు

CTR: చిత్తూరు 8వ (ఐఆర్) బెటాలియన్, ఏపీఎస్పీలో ఖాళీగా ఉన్న 37 అవుట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బెటాలియన్ కమాండెంట్ తెలిపారు. ఆఫీస్ సబార్డినేట్, స్వీపర్, స్కావెంజర్, కుక్, ధోబీ, బార్బర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 15న సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.