W.G: మొగల్తూరు మండలం కేపీ పాలెం సౌత్ శివారులో శనివారం పేకాట స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించినట్లు ఎస్ఐ సీహెచ్ జయలక్ష్మి తెలిపారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.1,540 నగదుతో పాటు 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట శిబిరంపై దాడి.. ఐదుగురి అరెస్ట్


