హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే బాధ్యత గురువులదే'

VKB: భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని బూరుగుపల్లి సర్పంచ్ పట్లోళ్ల వరప్రసాద్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించి మెమెంటోలు అందజేశారు. ఉపాధ్యాయ వృత్తి అత్యంత పవిత్రమైనదని పేర్కొన్నారు.