హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బెల్ట్ షాపులపై పోలీసుల దాడులు

VSP: సీఐ నమ్మి గణేష్ ఆదేశాల మేరకు ఎస్సైలు నేతాజీ, రామచంద్ర రాజు నేతృత్వంలో రెండు బృందాలుగా విడిపోయిన పోలీసులు దువ్వాడ పరిధితో పాటు మంగళపాలెం ప్రాంతంలో శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమతుల్లేని బెల్ట్ షాపులపై దాడులు చేసి వందకుపైగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, సరిపల్లి వరలక్ష్మి, కరెడ్ల గణేష్, దాడి హేమ, ఆర్శి సురేష్‌లను అదుపులోకి తీసుకున్నారు.