హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ పనితీరుపై ఈడీ సమీక్ష

NZB: టీజీఎస్‌ఆర్టీసీ ఈడీ సోలమన్ నిజామాబాద్ రీజియన్‌లో డిపోల పనితీరును శనివారం సమీక్షించారు. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన సేవలు అందించాలని సూచించారు. ఆదాయాన్ని పెంచుతూ ఖర్చులను నియంత్రించి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.