హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉపాధ్యాయులే విద్యార్థుల జీవితాలకు మార్గదర్శకులు'

‌అన్నమయ్య: ఆర్‌కే కన్వెన్షన్‌ హాల్‌లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉపాధ్యాయులు విద్యార్థులకు మెంటర్లుగా, మార్గదర్శకులుగా నిలవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. ఉపాధ్యాయులే దేశ నిర్మాణానికి పునాదులని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. ఈ సందర్భంగా 60 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేసి సన్మానించారు.