హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరెంట్ షాక్‌తో బాలుడు మృతి

HNK: నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఎర్త్ వైరు తగిలి మూడేళ్ల బాలుడు మృతి చెందిన విషాద ఘటన HNK జిల్లా భీమదేవరపల్లి మండలం వీరభద్రనగర్ లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. వీరభద్రనగర్కు చెందిన బానోతు సంపత్ కుమారుడు రిషి (3) ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు ఎర్త్ వైరు తగిలి అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు.