హైదరాబాద్: 28°C
వ్యాపారం

తెలుగు రాష్ట్రాల్లో జియో రికార్డు వృద్ధి

2016 సెప్టెంబర్ 5న జియో వాణిజ్య సేవలు ప్రారంభించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో జియో సేవలు ప్రారంభించిన తొలి నెలలోనే 12.4 లక్షల కనెక్షన్లను సాధించింది. జూన్ 2026 నాటికి ఇవి 3.25 కోట్లకు చేరాయి. 2026 జూన్ నాటికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం 8.83 కోట్ల వైర్‌లెస్ కనెక్షన్లలో 36.9% వాటాతో జియో బలమైన రెండో అతిపెద్ద టెలికాం వ్యవస్థగా అవతరించింది.