హైదరాబాద్: 28°C
వ్యాపారం

15 ట్రిలియన్ డాలర్లకు చేరిన కుబేరుల సంపద

ఏఐ కారణంగా చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. అయితే, మరోవైపు ఏఐ రంగంలో పెట్టుబడులు కలసిరావడంతో ప్రపంచవ్యాప్తంగా సంపన్నుల జనాభా పెరుగుతోంది. గతేడాది బిలియనీర్ల సంఖ్య దాదాపు 3800కు చేరినట్లు గ్లోబల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ అల్ట్రాటా నివేదికలో వెల్లడించింది. వీరి మొత్తం సంపద సుమారు 15.1 ట్రిలియన్ డాలర్లకు (రూ.1,417.37 లక్షల కోట్లు) చేరుకున్నట్లు తెలిపింది.