లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ భారీగా ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే రెండేళ్లలో బ్రిటన్‌లో దాదాపు 4 వేల ఉద్యోగాలకు కోత విధించనున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అమెరికా టారిఫ్‌లు, వాహన తయారీ ఖర్చులు పెరగడం, విక్రయాలు తగ్గడమే ఇందుకు కారణమని తెలిపాయి. ఆర్థికపరమైన అంశాలకు తగ్గట్టుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వ్యాపారం
మరో కంపెనీలో 4 వేల ఉద్యోగాలు కోత!


