హైదరాబాద్: 28°C
తెలంగాణ

మదర్‌ తెరిసా సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే

HNK: మదర్‌ తెరిసా వర్ధంతి సందర్భంగా హన్మకొండ ఫాతిమానగర్‌లోని ఆమె విగ్రహం వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పాల్గొని పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలు, అనాథలు, నిరాశ్రయుల కోసం ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. మానవతా సేవలకు ఆమె జీవితం ఆదర్శమని పేర్కొన్నారు. నాయకులు తదితరులు ఉన్నారు.