హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మార్కాపురంలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు

మార్కాపురంలోని జడ్పీహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ విజయ సునీత మాట్లాడుతూ.. విద్యార్థులను సన్మార్గంలో తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. నవసమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులే పునాదులు వేస్తారని అన్నారు. జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు.