హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిన్ననాటి గురువును సత్కరించిన సీఐ

GNTR: వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో సీఐ బాలకృష్ణ పాల్గొన్నారు. జీవితంలో తల్లిదండ్రుల తర్వాత గురువుదే అత్యున్నత స్థానమని పేర్కొన్న ఆయన, తనకు అక్షరాలు నేర్పిన చిన్ననాటి గురువు మాధవిని ఘనంగా సన్మానించారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువును సత్కరించుకోవడం ఎంతో గర్వకారణమని సీఐ తెలిపారు.