హైదరాబాద్: 28°C
తెలంగాణ

షార్ట్ సర్క్యూట్‌తో రేకుల షెడ్డు దగ్ధం

JN: స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలంలోని రాఘవపూర్‌లో శనివారం ప్రమాదవశాత్తు షార్ట్‌సర్క్యూట్‌ జరగడంతో రేకుల షెడ్డు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో రూ.50 వేల నగదు, పిల్లల సర్టిఫికెట్లు, ఆధార్‌ కార్డులు, బ్యాంకు పాస్‌బుక్‌లు, నిత్యావసర వస్తువులు, బట్టలు కాలిపోయాయి. సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు బెజ్జం రాజు–రజిత దంపతులు తెలిపారు.