KRNL: ఆదోని ట్రాఫిక్ పోలీసులు శనివారం ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ వెంకటరమణ, ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆటోలకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని సూచించారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని ఓవర్‌లోడ్ చేయరాదన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా వాహనాలు నడపాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన


