శ్రీకాకుళం జిల్లాలో గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరని ఎస్పీ మహేశ్వర రెడ్డి శనివారం తెలిపారు. సింగిల్ విండో ద్వారా ఆన్‌లైన్‌లో అన్ని శాఖల అనుమతులు, క్యూఆర్ కోడ్‌తో ఎన్ఓసీ ఇస్తామని, ఎలాంటి చలానా లేదని పేర్కొన్నారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు తప్పనిసరి అని, నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
గణేష్ మండపాలకు ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి: ఎస్పీ


