హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉపాధ్యాయులకు ఘన సత్కారం

PLD: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నరసరావుపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులను సత్కరించారు. రోటరీ కమ్యూనిటీ హాల్లో జరిగిన కార్యక్రమంలో డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయులకు శాలువాలు, పూలమాలలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు.