హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వినాయక చవితి వేడుకల్లో విద్యుత్‌ భద్రత పాటించాలి'

BHPL: వినాయక చవితి వేడుకల సందర్భంగా విద్యుత్‌ ప్రమాదాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రేగొండ విద్యుత్‌ శాఖ ఏఈ రమేశ్‌ సూచించారు. గణేష్‌ మండపాల వద్ద విద్యుత్‌ వైర్లు, పరికరాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. విద్యుత్‌ లైన్లకు సురక్షిత దూరం పాటించాలని, ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే వెంటనే విద్యుత్‌ సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు.