BDK: మణుగూరు మండలంలో శనివారం సింహాద్రి శివకుమార్ హత్య కేసులో పరారీలో ఉన్న మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ రవీందర్‌రెడ్డి వివరాల ప్రకారం.. శివరాత్రి సాంబశివరావు, నాగేంద్రబాబు, చాబోతుల ఏసు, పల్లపు మల్లికార్జున్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో కేసులో మొత్తం 27 మంది నిందితుల అరెస్ట్ పూర్తయిందని తెలిపారు.
తెలంగాణ
శివకుమార్ హత్య కేసులో మరో నలుగురు అరెస్ట్


