PDPL: రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో 35 ఏళ్లుగా హోంగార్డులుగా సేవలందించి ఉద్యోగ విరమణ పొందుతున్న జే.రామయ్య, పీ.సత్తయ్యలకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. సీపీ అంబర్ కిషోర్ ఝా పూలమాలలు, శాలువాలతో వారిని సత్కరించారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, హోంగార్డులు పాల్గొన్నారు.
తెలంగాణ
హోంగార్డుల సేవలను అభినందించిన సీపీ


