హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాష్‌రూమ్‌లు లేకపోవడం దురదృష్టకరం: ఎమ్మెల్సీ

RR: షాద్‌నగర్ కమ్మదనం గురుకులంలో విద్యార్థినులు, సిబ్బందికి మౌలిక వసతులు కరువయ్యాయని ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వాష్‌రూమ్‌లు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాఠశాలను సందర్శించి సమస్యలు తెలుసుకోవాలని, అందరం కలిసి మౌలిక వసతుల కల్పనకు కృషి చేద్దామని కోరారు.