హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం'

BHNG: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.