హైదరాబాద్: 28°C
తెలంగాణ

మౌలాలిలో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ

MDCL: మౌలాలి ఉప్పరగూడలోని షిరిడీనగర్ స్ట్రీట్ నంబర్ 6లో డ్రైనేజీ పొంగిపొర్లుతోంది. మురుగునీరు రోడ్డుపైకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుర్వాసనతో పాటు మురుగునీరు నిలిచిపోవడంతో నడవడం కూడా కష్టంగా ఉందని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరారు.