హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీ బీకే పార్థసారథి పరామర్శ

SS: పెనుకొండ మండలం రాంపురం పంచాయతీ సర్పంచ్ బంధువు శ్రీనివాసులు తల్లి జయమ్మ ఇటీవల మరణించగా, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి శనివారం వారి నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. జయమ్మ మరణం కుటుంబానికి తీరని లోటని, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట మండల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.