హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలు నగరాభివృద్ధికి ఊతం

కర్నూలు నగరంలో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.88.06 కోట్లతో వివిధ పనులు చేపడుతున్నట్లు మంత్రి టీ.జీ. భరత్ తెలిపారు. ఇవాళ కమిషనర్‌ చల్లా ఓబులేసుతో కలిసి రూ.2.04 కోట్ల ఎన్‌క్యాప్‌ నిధులతో చేపట్టనున్న సెంట్రల్‌ మీడియన్లు, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.