హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలంపల్లిలో ఉచిత వైద్య శిబిరం

MDK: చేగుంట మండలం పోలంపల్లి గ్రామంలో మల్లారెడ్డి ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి తెలిపారు. సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో శిబిరం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేసినట్లు తెలిపారు.