NGKL: బిజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ శ్రీ శనేశ్వర ఆలయంలో శ్రావణ కృష్ణపక్ష నవమిని పురస్కరించుకుని భక్తులు శనిగ్రహ దోష నివారణ పూజలు నిర్వహించారు. స్వామివారికి వేదమంత్రాల నడుమ తిలతైలాభిషేకం చేశారు. గోన బుద్ధారెడ్డి కాలం నాటి పరమశివుడికి రుద్రాభిషేకం, దీపారాధన చేపట్టారు. అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
తెలంగాణ
శనేశ్వర క్షేత్రంలో నవమి పూజలు


