హైదరాబాద్: 28°C
తెలంగాణ

22ఏ భూముల సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే

NRML: ఇందిరాపార్క్‌లో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాదీక్షలో ముధోల్‌ ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌ శనివారం పాల్గొన్నారు. 22ఏ నిషేధిత జాబితా నుంచి బాధితుల భూములను తొలగించి వారికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ధరణి సమయంలో ఎదురైన ఇబ్బందులు భూభారతితోనూ కొనసాగుతున్నాయని, భూ సమస్యలతో రైతులు, భూములు కొనుగోలు చేసిన వారు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.