హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'అధికారులే భూముల వద్దకు రావడం సంతోషంగా ఉంది'

BHPL: అప్పయ్యపల్లి శివారులోని తూపురం వద్ద జరుగుతున్న డిజిటల్‌ భూ రీ-సర్వేపై రైతు యాకయ్య హర్షం వ్యక్తం చేశారు. గతంలో భూ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగేవారమని, ప్రస్తుతం అధికారులు గ్రామానికే వచ్చి భూముల వద్ద సర్వే చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆధునిక సాంకేతికతతో భూ వివరాలు నమోదు చేయడం వల్ల పారదర్శకత పెరిగి, భూ వివాదాలు తగ్గుతాయన్నారు.